సరదాగా తీసుకోవాలి మరి!!
కొత్త కోడలు ....4 జి స్పీడు,
అందులోనూ జియో మరి!!
అత్తా "ఉసూరు వల్లి"....కొత్త కోడలు కి చెబుతోంది ....
"ఇదిగో చూడు కోడలా....
పకోడీలు వేసేటప్పుడు....
ఒక్కొక్క పకోడీ వేసి వేయించాలి....
అప్పుడె మీ మావ గారికి ఇష్టం!!!
బెండకాయలు తరిగే ముందు....
ఒక్కొక్క బెండకాయా బాగా కడగాలి....
అప్పుడె కూర బాగుంటుంది !!!
కొత్తిమీర ...ఒక్కొక్క ఆకూ కోసి...కడిగి...
వెయ్యాలి...అప్పుడు కూర రుచిగా వుంటుంది...
2...3 ...రోజులు కోడలు "కత్తి -రీనా "...
ఓపిక పట్టింది!!!
4 గో రోజు...
"అత్తా....కొంచెం కూర చూస్తూ వుండండి...
తల స్నానం చేసి వస్తాను" అని బాత్రూమ్ లోకి వెళ్ళింది!!
కూర అయిపొయింది ..
సాంబార్ అయిపొయింది.....
చట్నీ చెయ్యడం అయిపొయింది..
కానీ కోడలు "కత్తి-రీనా" మటుకు ఇంకా బాత్ రూమ్ లోంచి రాలేదు!!!
అత్తా "ఉసూరు వల్లి" కి సహనం పోయింది !!!
బాత్రూమ్ వద్దకు వెళ్లి....
"ఎం!? స్నానం చేస్తున్నావా....నిద్ద్రోతున్నా వా? " అంటూ అరిచింది!!
"అయ్యో...స్నానం చేస్తున్నాను అత్తయ్యా...
తల మీద ...
ప్రతి వెంట్రుకా...
జాగర్తగా తీసి....
షాంపూ పెడుతున్నాను...
ఇలా స్నానం చేస్తే మంచిదని...........
మీ అబ్బాయి చెప్పారు, మరి"!! అంది కోడలు "కత్తి-రీనా"